Header Banner

అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్! డబ్ల్యూటీఓకు అధికారికంగా..

  Tue May 13, 2025 15:19        Politics, U S A

భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాల కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్‌ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. అమెరికా ఇటీవల విధించిన టారిఫ్‌ల కారణంగా 7.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అందుకే అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్‌ తప్పుపట్టింది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు. క్రూడ్‌ స్టీల్‌ తయారీలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు దీనిపై ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం పడనుంది. ఇప్పుడు అమెరికా వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్‌ తెలియజేయడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ-వాషింగ్టన్‌ అత్యంత సమీపానికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించడం కోసం ఈ డీల్‌ ద్వారా భారత్‌ చాలా రాయితీలను ఆఫర్‌ చేసినట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica